calender_icon.png 24 February, 2026 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వండి

24-02-2026 12:10:30 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్డేషన్లు ఇవ్వాలని కోరుతూ బిగ్ పేపర్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో  పెద్ద పేపర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడారు.

నిబంధనల పేరు చెబుతూ పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస గుర్తింపు కార్డు అయిన అక్రిడేషన్ కార్డు ఇవ్వకుంటే ఎట్లా అని పలువురు ప్రశ్నించారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో జర్నలిస్టులకు న్యాయం జరిగేలా అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అనంతరం జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.