16 April, 2026 | 9:09 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ఇవ్వం

28-06-2025 01:46 AM

కేఆర్‌ఎంబీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): కృష్ణా నదీ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ)లో పనిచేసే పనిచేసే ఉద్యోగులెవరికీ ఇకపై ఇన్సెంటివ్‌లు ఇవ్వబోమని బోర్డు సమావేశంలో తేల్చారు. శుక్రవారం జలసౌధలో కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో సమావేశం జరగ్గా.. ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.

ఏపీ, తెలంగాణ అధికారులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. కృష్ణాబోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్‌లపైనే ఈ సమావేశం ఏర్పాటు చేయగా... కేంద్ర జల్ శక్తి శాఖ గైడ్‌లైన్స్, హైకోర్టు ఆదేశాలపై భేటీలో చర్చించారు. ఇకపై స్పెషల్ ఇన్సెంటివ్‌లు ఇవ్వరాదని... ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్‌లను రికవరీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు.