calender_icon.png 10 December, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా!

10-12-2025 12:41:36 AM

చౌకనపల్లి అభ్యర్థి మల్లేశ్ రాజప్ప

కంగ్టి, డిసెంబర్ 9: ఓటర్లు తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలు గా అభివృద్ధి చేసి చూపిస్తానని కంగ్టి మండల పరిధిలో గల చౌకనపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి పాదించిన అభ్యర్థి మల్లేశ్ రాజప్ప హామీనిచ్చారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ తన మేనిఫెస్టోను వెల్లడించారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం, గ్రంథాలయం, బస్టాండు ఏర్పాటు చేస్తానన్నారు.

మురుగు నీటి కాలువల నిర్మాణం, వీధి రోడ్ల నిర్మాణం, అంతరాయం లేని విద్యుత్తు సరఫరా, యువకులకు ఉపాధి అవకాశాలు, గ్రామంలో ఇల్లు లేని అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకొనుటకు ప్రత్యేక చొరవ చూపిస్తానన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ సహకారంతో మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీనిచ్చారు. ఓ రైతు బిడ్డగా, మీ అందరి బిడ్డగా అక్కున చేర్చుకొని ఆశీర్వదించాలని మల్లేశ్ రాజప్ప కోరారు.