calender_icon.png 11 December, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా త్యాగం మరువలేనిది

10-12-2025 12:43:02 AM

  1. ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి 

పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 9, (విజయక్రాంతి): తెలంగాణలోని 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంను తెలంగాణ ప్రజలు సోనియా గాం ధీని ఎన్నటికీ మర్చిపోలేరని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి అన్నారు. భద్రాద్రి జిల్లా విద్యానగర్ లోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్‌ఆర్‌ఆర్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న సోనియాగాంధీ నాయకత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన రోజు ఇదేనని అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.

ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారని అన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రాష్ట్రంలోని అన్ని క లెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాయని, తెలంగాణ అభివృద్ధి వైపు పురోగమిస్తోందని ఎమ్మెల్యే ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, రైల్వే బోర్డు సభ్యులు వై శ్రీనివాస్ రెడ్డి, పెనగడప నాగరాజు, కల్లూరి సంపత్, మరియు తదితరులు పాల్గొన్నారు.