calender_icon.png 11 December, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ప్రత్యేక కార్యక్రమాలు

10-12-2025 12:41:24 AM

భద్రాచలం డిసెంబర్ 9(విజయక్రాంతి)ముక్కోటి ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవం సందర్భంగా వచ్చే భక్తులకు కనువిందు చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

మంగళవారం నాడు గోదావరి కరకట్ట ప్రాంతంలో తేప్పోత్సవం జరిగే ప్రదేశాలు, రివర్ ఫెస్టివల్ కొరకు నిర్మాణం చేపట్టే తాత్కాలిక పర్యాటకుల విడిది గృహాలు మరియు వివిధ గిరిజన వంటకాలు, గిరిజన కళాఖండాలకు సంబంధించిన స్టాల్స్ మరియు పర్యాటకులు విహరించే బోట్ షికార్ సంబంధించిన పరిసరాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పర్యాటకులకు అన్ని వసతి సౌకర్యాలతో తాత్కాలిక విడిది గృహాలు, వివిధ పాఠశాలల బాలబాలికలచే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే వివిధ కళాకృతులకు సంబంధించిన స్టాల్స్ భక్తులు మెచ్చేలా ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున పర్యాటకులు వీడిది గృహాలలో ప్రశాంతంగా సేద తీరడానికి మరియు తేప్పల మీద విహరించడానికి బోట్ సౌకర్యం,

బస చేసిన వారికి డైనింగ్ హాల్ ఏర్పాట్లు విడిది చేసే ప్రాంతమంతా విద్యుత్ కాంతులు వెదజల్లేలా సోలార్ విద్యుత్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, చుట్టూ ఉన్న గోదావరి అందాలను సెల్ఫీ ద్వారా ఫోటోలు తీసుకోవడానికి సెల్ఫీ పాయింట్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు.

అలాగే నిర్వహించే కల్చరల్ ప్రోగ్రామ్స్ గోదావరి పక్కన ఏర్పాటు చేసిన స్టేజి నుండి భద్రాచలం పట్టణం మొత్తం వినిపించేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తామని,అలాగే ఎస్ హెచ్ జి గిరిజన మహిళలు తయారు చేసే ఆర్గానిక్ ప్రొడకట్స్, మిల్లెట్ బిస్కెట్లు, సబ్బులు, షాంపూలు, ఆర్గానిక్ నెయ్యి మరియు భక్తులకు అవసరమయ్యే తినుబండారాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

ఈ ఏర్పాట్లు అన్ని పది రోజులలో పూర్తయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట, దేవస్థానం ఈవో దామోదర్ రావు, తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ డీఈ జీవన్, ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వరరావు, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.