15 March, 2026 | 7:39 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అవకాశం ఇవ్వండి సేవ చేస్తా..

15-09-2024 01:04 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి

హుజూరాబాద్, సెప్టెంబరు 14: రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు పట్టభద్రులు అవకాశం కల్పించి గెలిపిస్తే.. సేవచేసి చూపిస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని అల్ఫోర్స్ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్లు ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలని సూ చించారు. పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్‌ను చూసి ఆకర్షితుడై.. తాను కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నానని అన్నారు.  అనంతరం ఆయన ఎస్సార్ డిగ్రీ కాలేజీ వాకర్స్‌ను కలిశారు. పట్టభద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో తనకు సహకరించాలని మద్దతు కోరారు. కార్య క్రమంలో వాకర్స్, విద్యాసంస్థల యాజమాన్యాలు, సేవాసంస్థల నిర్వాహకులు, యువజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, అ ధ్యాపకులు పాల్గొన్నారు.