3 September, 2026 | 4:51 AM

ప్రధానిగా రాహుల్‌కే టీవీకే మద్దతు

02-09-2026 | 01:08am
  1. కాంగ్రెస్ నేత తారాహై కత్బర్ట్
  2. విభేదాలు ఊహాగానాలే
  3. సీఎం విజయ్ పనితీరు భేష్
  4. రాహులే ప్రధాని అభ్యర్థి: ఎండీఎంకే నేత వైకో

బెంగళూరు, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): ప్రధాని అభ్యర్థి విషయంలో టీవీకే పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి (Congress leader Rahul Gandhi) మద్దతు తెలియజేస్తుందని తమిళనాడు కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ తెలిపారు. ఇండియా టూడే ‘మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే’(Mood of the Nation Survey) గురించి మంగళవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.

ఇండియా కూటమి తరఫున పీఎం అభ్యర్థిని ఇప్పటికే ఎంచుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ మధ్య విభేదాలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపడేశారు. సీఎం విజ య్ ప్రధాని అవుతారనే ప్రచారం టీవీకే కా ర్యకర్తల ఉత్సాహం వల్లే జరుగుతోందని అది పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని ప్రతిబింబించదన్నారు. సీఎం విజయ్ రాహుల్ గాం ధీని ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నారని, ఆ దిశగానే ముందుకు వెళుతున్నారని తారాహై స్పష్టం చేశారు.

మూడు ఆఫ్ ద నేషన్ సర్వే పై ప్రస్తుతానికి టీవీకే వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా, భారీ ఎత్తున ప్రధాని అభ్యర్థిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవై పు ఇదే అంశంపై తమిళనాడు ఎండీఎంకే నేత వైకో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధా ని అభ్యర్థి విషయంలో టీవీకే మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని వైకో సీఎం విజయ్‌కు సూచించా రు.

టీవీకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ అవినీతి రహితంగా నడిపిస్తున్నారని, ఇందులో ఎలాంటి సందేహం లేదనికొనియాడారు. ఈప్రభుత్వ పనితీరుకు వందకుగాను 80 మార్కులు ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీనే ప్రధాని అభ్యర్థి గా ఉంటారన్నారు. కావేరి నిర్వహణను కేం ద్రంలోని మోదీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రజాస్వామ్యానికి ముప్పుగా వైకో అభివర్ణించారు.