27 July, 2026 | 6:32 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

పాతకాలం పద్ధతిలో ఇంట్లోనే ప్రసవం

25-08-2024 04:02 PM

జగిత్యాల,ఆగస్టు 25(విజయక్రాంతి): ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో మాజీ సర్పంచ్ వైనమిది పాతకాలం పద్ధతిలో ఇంట్లోనే ప్రసవం చేయించి బిడ్డకు పురుడుపోసింది. వివరాల్లోకి వెళ్లితే... జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజీపేట గ్రామానికి చెందిన  కల్లెం కోమలత అనే మహిళకు శనివారం రాత్రి పురిటినొప్పిలు వచ్చాయి. గత రెండు రోజుల‌ క్రితం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఇంకా సమయం ఉందని చెప్పటంతో ఇంటికి వచ్చారు. అదే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా పురిటినొప్పులు రావటంతోపాటు మరోవైపు విపరీతమైన వర్షం ఉండటంతో మాజీ సర్పంచ్ ఓ వైపు బాలసాని లహరికకు చెప్పి, మరో వైపు అంబులెన్స్ వారికి సమాచారం అందించారు. నొప్పులు ఎక్కువ రావటంతో ప్రసవం చేసింది. పండంటి మగ బిడ్డ జన్మించారు. అంతలోపు అంబులెన్స్ కు సమాచారం అందించటంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి తల్లీబిడ్డలను అసుపత్రికి తరలించారు.