24 March, 2026 | 4:02 AM

నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం అభినందనీయం

27-10-2024 12:35 AM

ఎంపీ ఈటల రాజేందర్

కాప్రా, అక్టోబర్ 26: నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళాను నిర్వహించి ఉపాధి కల్పించడం అభినందనీయమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ ఆడిటోరియంలో ఎస్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఐఏ, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ సహకారంతో నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా 300కు పైగా యువతీయువకులకు పలు కంపెనీలకు సంబంధించిన ఉద్యోగ నియమాక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐఏ అధ్యక్ష, కార్యదర్శులు గోవింద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఐలా చైర్మన్ రోషిరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌జీ ఫౌండేషన్ చైర్మన్ గాండే సుధాకర్, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ప్రతినిధులు పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.