22 July, 2026 | 5:14 AM

గ్లామరస్ నయన్ మటక్క

26-11-2024 12:03 AM

వరుణ్ ధావన్, జాకీ ష్రాఫ్, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బేబీ జాన్’. ఈ సినిమాతోనే కీర్తీ సురేశ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ మూవీ మేకింగ్ సమయం నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాలీస్ దర్శకత్వంలో ఏ ఫర్ యాపిల్ స్టూడియోస్, సినీ ఒన్ స్టూడియోస్ బ్యానర్లపై మురద్ ఖేతాని, ప్రియా అట్లీ, జ్యోతీ దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘నయన్ మటక్క’ అనే పాట సోమవారం విడుదలైంది.

దిల్జిత్ దోసంజ్, దీక్షిత వెంకడేశన్ అలియా ఢీ కలిసి ఈ పాటను ఆలపించారు. ఇర్షద్ కమిల్ సాహిత్యం అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. ఈ గీతంలో వరుణ్ ధావన్, కీర్తీ సురేశ్ కెమిస్ట్రీ అదుర్స్ అనిపించేలా, అల్టిమేట్ డ్యాన్స్ ఆంథమ్‌గా ఉంది. ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది.