యూకే ఏటీసీలో లోపం
లండన్, సెప్టెంబర్ 8: బ్రిటన్ (యూకే)లోని ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో (Air Traffic Control) సాంకేతిక లోపంతో భారీ ఎత్తున విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంగళవారం అర్థరాత్రి వరకు 625 విమానాలు రద్దయ్యాయి. విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో హిత్రూ, స్టాన్సెడ్, మాంచెస్టర్, బర్మింగ్ హమ్ తదితర విమానాశ్రయాల్లోని ఐదుకు పైగా సంస్థలకు చెందిన విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు ఫ్లుటై మానిటరింగ్ వెబ్సైట్ ఫ్లుటైరాడార్ 24 తెలిపింది.
సాంకేతిక లోపాన్ని నివారించేందుకు నిపుణులు పనిచేస్తున్నారని వెల్లడించింది. ఈజీజెట్కు చెందిన 218, బ్రిటిష్ ఏయిర్వేస్ 132, రైనాఏయిర్ 41, కేఎల్ఎం 37, యూరోవింగ్స్ ఏయిర్లైన్స్కు చెందిన 22 విమానాలను రద్దయ్యాయని ఫ్లుటైరాడార్ ప్రకటించింది. సాంకేతిక లోపానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని పేర్కొంది. వ్యవస్థ వైఫల్యాన్ని నిరసిస్తూ వెంటనే బ్రిటిష్ ఏటీసీ సీఈవో మార్టిన్ రోల్ఫ్ రాజీనామా చేయాలని పలు ఏయిర్లైన్లు డిమాండ్ చేశాయి.