హైదరాబాద్‌లో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’
సెప్టెంబర్ 5, 6న హెచ్‌ఐసీసీలో నిర్వహణ n ప్రపంచ ఏఐ రాజధానిగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని ఏఐ రాజధానిగా నిలబెట్టే లక్ష్యంతో గ్లోబల్ ఏఐ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే గ్లోబల్ ఏఐ సదస్సు నేపథ్యంలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) మంగళవారం కర్టెన్ రైజర్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని, మాట్లాడుతూ.. సమ్మిళిత పరిష్కారా లను సృష్టించడానికి ఏఐ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.
పరిశ్రమ నాయకులు, విధాన కర్తలు, ఆవిష్కర్తల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, అయితే గొప్ప శక్తితోపాటే ఎప్పుడూ గొప్ప బాధ్యత కూడా వస్తుందని చెప్పారు. ఏఐని మనం ఉపయోగించుకుంటున్నప్పుడు, దానిని నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనంతో మానవాళికి సేవలందించేలా చూడాలని పేర్కొన్నారు. సదస్సు విజయానికి అపారమైన అనుభవం ఉన్న హైసియాతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
త్వరలో ఏర్పాటు చేయబోయే నైపుణ్య విశ్వవిద్యాలయం, ప్రతిష్టాత్మక ఏఐ సిటీ లాంటి రాష్ట్ర కార్యక్రమాలకు ఐటీ పరిశ్రమ కూడా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐ నైపుణ్యాలతో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. టాస్క్, టీ టీఎస్‌ఐసీ, ఇతర కీలక ప్రభుత్వ సంస్థల సహకారంతో ఏఐ/జీఎన్‌ఏఐలో 10 వేల మందికి పైగా విద్యార్థులకు నైపు ణ్యాలను పెంచాలని యోచిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఐటీ శాఖ అధికారులు అమర్‌నాథ్‌రెడ్డి, రమాదేవి, టీ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, మాత్ సీఈవో రాహుల్ పైత్ తదితరులు హాజరయ్యారు.






