గ్రేటర్ అభివృద్ధిపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ అభి వృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్ల క్ష్యం వహిస్తోందని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేయాలన్న ఉద్ధేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఎస్‌ఆర్‌డీపీ స్కీంను తీసుకొచ్చిందన్నారు. దీని కింద 42 కొత్త ప్రాజెక్టులను పూర్తిచేయాలని సంకల్పించి 36 ప్రాజెక్టు లను పూర్తి చేసిందని కేటీఆర్ తెలిపారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉందన్నా రు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనుల ను పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా ఎస్‌ఆర్‌డీపీ మూడో దశను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
మూడో దశకు సంబంధించిన ప్రణాళికలకు ఇప్పటికే ప్రభు త్వం నుంచి ఆమోదం లభించదన్నా రు. మూడో దశలో కీలకమైన మూసీకి ఇరువైపులా ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్కు కింద టన్నెల్స్, ఫ్లుఓవర్‌లు, అండర్‌పాస్‌లు వంటి పను లు ఉన్నాయని తెలిపారు. నగర ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరచటం తో పాటు నగరాభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు.






