07-12-2025 12:42:02 AM
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శనివారం మంత్రులు శ్రీధర్‌బాబు, మహ్మద్ అజాహరుద్దీన్‌తో కలిసి డిప్యూటీ సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు.
నీతి అయోగ్, ఐఎస్బీ -హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈనెల 8న మధ్యాహ్నం 1:30 గంటలకు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్- 2025 సమ్మిట్‌ను రాష్ర్ట గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మొత్తం క్యాబినెట్ అంతా కలిసి ఆలోచనలు చేసి విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాయ స్థాయిలో పేరొందిన ఎకనమిస్టులు ప్రసంగిస్తారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
కార్యక్రమంలో మొదటి రోజు 8న అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ -మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, శ్రీధర్‌బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీ కె శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ర్ట డిప్యూటీ సీఎంగా తాను కూడా ప్రసంగించనున్నట్టు వివరించారు. సమ్మిట్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కీలక ప్రసంగం చేస్తారని ఆయన చెప్పారు.
శాఖల వారీగా ప్రత్యేక సెషన్స్
గ్లోబల్ సమ్మిట్‌లో పలు శాఖలకు సం బంధించిన సెషన్స్ ఉంటాయని చెప్పా రు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు సెషన్స్ ప్రారంభమవుతాయని, సెషన్‌లో అంశాలకు సంబంధించిన శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, నిష్ణాతులు పాల్గొంటారని తెలిపారు. 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయని, ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు మొదలై సాయం త్రం 6 గంటలకు ముగుస్తాయని వివరించారు.
తెలం గాణ రైజింగ్ గ్లొబెల్ సమ్మిట్‌లో 6 ఖండాల్లోని 44 దేశాల నుం చి 154 మంది ప్రతినిధులు పాల్గొంటు న్నట్లు తెలిపారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ర్టంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబెల్ సమ్మిట్ -2025 అనేది ప్రత్యేక సమ్మిట్ అని, ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలన్న సదుద్దేశంతో చేస్తున్నట్లు వివరించారు.
ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్‌కు సంబంధించినదిగా ఆయన అభివర్ణిం చారు. ఈ ఎకనమిక్ సమ్మిట్ రాష్ర్ట ప్రయోజనాలకు ఎతంగానో ఉపయోగ పడుతుం దగన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు సమ్మిట్ సక్సెస్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. ఎయిర్ లైన్స్ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యమైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.