07-12-2025 12:30:02 AM
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : 2024--25 సంవత్సరానికి సంబం ధించిన పారా బాయిల్ రైస్ రబీకోటా అదనపు కేటాయింపులు ఇవ్వాలని, అందు కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషుతోష్ అగ్నిహోత్రికి విజ్ఞప్తి చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీతో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం సచివాలయంలో సమావే శమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై చర్చించారు. కేఎంఎస్ 2024--25 (ఖరీఫ్, రబీ) కోసం కేంద్ర ప్రభుత్వం 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ రైస్ లక్ష్యాన్ని కేటాయించిందని, అయితే 2024--25 రబీ నుంచి ఇప్పటి వరకు 17.06 ఎల్‌ఎంటీ పారా బాయిల్, 0.87 ఎల్‌ఎంటీ ముడి బియ్యం సరఫరా చేసినట్టు వివరించారు. ఇంకా 2.34 ఎల్‌ఎంటీ పారాబాయిల్, 14. 26 ఎల్‌ఎంటీ ముడి బియ్యం సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు.
ఈ రబీ సీజన్‌లో ప్రధానంగా పారాబాయిల్ రైస్‌కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల కేఎంఎస్ 2024--25 (రబీ) కింద అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్ రైస్ కేటాయింపు చేయాలని మం త్రి కోరారు. పారా బాయిల్ రైస్ తరలింపు కోసం అదనపు రేక్‌ల అవసరం ఉంటుందని, ప్రస్తుత సంవత్సరం రేక్ తరలింపు గత సంవత్సరం(జనవరి-- నవంబర్)తో పోలిస్తే 13.5 ఎల్‌ఎంటీ కొరత ఉందని వివరించారు. ఎఫ్‌సీఐ గోడౌన్లలో పారాబాయిల్ బి య్యం నిల్వలు పేరుకుపోయాయని, దీంతో సీఎంఆర్ డెలివరీలు ఆలస్యం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
మరిన్న గోడౌన్ల కోసం ‘పీఈజీ’ని పునరుద్ధరించండి
సీఎంఆర్ నిల్వ పథకం కింద ఎఫ్‌సీఐ ద్వారా అదనంగా 15 ఎల్‌ఎంటీ నిల్వ సామర్థ్యాన్ని మంజూరు చేయాలని మంత్రి కోరా రు. ఫిబ్రవరి 2026 నాటికి ప్రభుత్వం 18 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉన్నందున, కేఎంఎస్ 24--25 కోసం 10 నుంచి 12 లక్షల టన్నుల బాయిల్ రైస్ అదనపు కోటా ఇవ్వాలని మంత్రి కోరారు. మిల్లర్లు ప్రస్తుత ధాన్యం సేకరణ విషయంలో వెనుకాడుతుండటం, మిల్లుల వద్ద స్థలం లేకపోవడం వల్ల కొత్త ధాన్యం సేకరణ మీద ప్రభావం చూపుతోందన్నారు.
7--8 సంవత్సరాల హామీతో ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం మరిన్ని గోడౌన్లను నిర్మించడానికి పీఈజీ పథకాన్ని పునరుద్ధరించాలని మంత్రి సూచించారు. రెండు సంవత్సరాల రాష్ట్ర హామీ, 06 సంవత్సరాల కేంద్ర హామీతో ప్రైవేట్ భాగస్వా మ్యంతో ఇస్తే నిలువ సామర్థ్యం పెంచుకోవచ్చని అన్నారు. తదుపరి 4 నెలలకు నెలకు 0.5 లక్షల బాయిల్ రైస్ తరలించవచ్చని తెలిపారు.
సీఎంఆర్ డెలివరీలు.. మరో 60 రోజుల పొడిగించండి
అలాగే ఖరీఫ్ 2024--25 కో సం సీఎంఆర్ బియ్యం సరఫరా వ్య వధి పొడిగిం చాలని, సీఎంఆర్ డెలివరీ సమయం 12.11. 2025 నాటికి ముగిసిందన్నారు. వివిధ కారణాల వల్ల ఇప్పటికీ 2.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉం దని తెలిపారు. ఖరీఫ్ 2024-25 కోసం సీఎంఆర్ డెలివరీల సమ యం మరో 60 రోజుల పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో నిల్వ సామర్థ్యం పెంపుదల చేయాలని, ప్రస్తుత ఎస్‌డబ్ల్యూసీ /సీడ బ్ల్యూసీ నిల్వ సామర్థ్యం 65 ఎల్‌ఎంటీ ఉందని, వివిధ ప్రభుత్వ సం స్థలు పూర్తిగా వీటిని ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. ఎఫ్‌సీఐ అద్దెకు తీసుకోగల గోడౌన్ల రకంపై పరిమితుల కారణం గా నిల్వ కొరతను ఎదుర్కొంటుందని అన్నా రు. ఈ నిల్వ పరిమితుల వల్ల సకాలంలో సీఎంఆర్ డెలివరీలు చేయ లేకపోతున్నామని అన్నారు.