calender_icon.png 16 June, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ఎల్లమ్మ బోనాలు

15-06-2025 11:26:47 PM

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎల్లమ్మ బోనాల పండుగ(Yellamma Bonalu Festival) అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్న ఈ శుభ తరుణంలో ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరిపైనా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ రంగాల్లో విజయం సాధించి, ఆర్థిక స్థిరత్వం పొందాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ బోనాల పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, సంపదలను తీసుకురావాలని కోరారు.