సింగరేణి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్
కొత్తగూడెం డిసెంబర్ 22, (విజయక్రాంతి ): సింగరేణి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ ప్రధాన వేడుకల నిర్వహణ ఏర్పాట్లను సోమవారం జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ ప్రధాన వేడుకల వేదిక, ఇతర ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ వేడుకలకు వచ్చే ముఖ్య అతిధులకు, సింగరేణీయులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కావలసిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమములో జిఎం(పర్సనల్) వెల్ఫేర్ & సిఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ , డిజిఎం(పర్సనల్) లు కేసా నారాయణ రావు, ముకుంద సత్యనారాయణ, బి.శివ కేశవ రావు, బి.రాజగోపాల్, డిజిఎం(ఈ&ఎం) రాజశేఖర్, ఎస్‌ఈ(సివిల్) రాజేంద్ర ప్రసాద్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్త్స్రన్, డివై.ఎస్‌ఈ(ఈ&ఎం) నరేష్ బాబు, ఇతర అధికారులు మరియు సివిల్ & ఎలెక్ట్రికల్ సిబ్బంధి పాల్గొన్నారు.




