1 July, 2026 | 12:50 AM

పట్టుకుంటే పట్టుకోండి.. ఆపేది లేదు

01-07-2026 12:04 AM
  1. అధికారులకు సవాల్ విసురుతున్న ఇసుక వ్యాపారులు 
  2. దొరికితే కేసు లేకుంటే ఆదాయమే కదా.. 
  3. ఎన్ని వాహనాలు పట్టుకుంటారు చూద్దాం అనేలా ఇసుక చోరీ
  4. చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు 

కోయిల్ కొండ జూన్ 30 : ఇసుక వ్యాపారులకు అధికారులకు సవాల్ విసురుతున్నారంటే అంతుచిక్కని ప్రశ్నగా మారుతుంది. క్లూస్ టీమ్ తో ఎంత పెద్ద చోరీలు చేపట్టిన ఎక్కడ దాక్కున్న వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టే పోలీసులకు ఇసుక వ్యాపారుల చోరీ మాత్రం అర్థం కాని పరిస్థితులను తీసుకువస్తుంది. రాత్రి అంటే రాత్రి పగలు అంటే పగలే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇసుక తరలింపు లక్ష్యంగా ఇసుక వ్యాపారులు కన్నుల్లో వత్తులు వేసుకొని తమ తమ వ్యాపారాలను దర్జాగా కొనసాగిస్తున్నారు. వరుసగా కోయిలకొండ మండలంలో ఇసుక వాహనాలను పోలీస్ అధికారులు పట్టుకుంటున్నప్పటికీ నిలుపుదల చేయడంలో మాత్రం ఆశించిన మేరకు ఫలితం వస్తలేదని ఆ ప్రాంతవాసులు చెబుతున్న మాట. 

 దర్జాగా దందా.. ఆపేదెవరు చూద్దాం?

 ఇసుక దందా అంటేనే అది శరమాములే ఎంతమంది అధికారులు మారిన ప్రభుత్వాలు వేరైనా దండ మాత్రం దర్జాగా జరుగుతుందని ఎవరు ఆపలేరని ఆయా గ్రామాల ప్రజలే చెబుతున్నారంటే ఈ ఇసుక వ్యాపారం ఏమాత్రం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక వాహనం పట్టుకొని ఆ తర్వాత చూసి చూడనట్టు వ్యవహరించడంతో యాదేచంగా ఇసుక వ్యవహారం ఇదంతా శరమాములే అన్నట్టు జరుగుతుంది.

మండల పరిధిలోని సూరారం వాగు తో పాటు ఇతర వాగులలో కూడా పుష్కలంగా ఇసుక అందుబాటులో ఉండడంతో దొరికిన కాడికి దోచుకునే ప్రయత్నాలు ఇసుక వ్యాపారాలు దర్జాగా చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఈ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ అధికారులు సైతం అటువైపు చూడకపోవడంతో నామమాత్రంగానే చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు చెబుతున్న మాట. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రం పూర్తిస్థాయిలో స్పందించి అక్రమ ఇసుక రవాలను అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటాం..

 అక్రమంగా ఇసుక తరలింపు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అలా అక్రమంగా తరలించినట్లు ప్రజల దృష్టికి వస్తే తమకు సమాచారం అందించాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయడం కఠినంగా వ్యవహరిస్తాం. 

- నాగరాజు, ఎస్‌ఐ, కోయిల్ కొండ