15 July, 2026 | 8:13 PM

ఇంటింటికి వెళ్ళి సర్ సవరణ పూర్తి చేయండి

15-07-2026 07:50 PM

- తహసీల్దార్ నవీన్ కుమార్ ఆదేశం

కోహెడ: గ్రామం లోని ఓటరు ఇంటికి వెళ్లి సర్ సవరణను పూర్తి చేయాలని.. బీఎల్ఓ, బీఎల్ఏ లను తహసీల్దార్ నవీన్ కుమార్ ఆదేశించారు. కోహెడ మండల కేంద్రంలో కొనసాగుతున్న.. 96, 97, 98 బూత్ లలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. బీఎల్ఓ, బీఎల్ఏలు ప్రత్యేకించి పెండింగ్ లో ఉన్న గ్రామానికి చెందిన స్థానిక ఓటరు ఇంటికి క్షేత్ర స్థాయిలో సందర్శించి సర్ పక్రియను పూర్తి చేయాలన్నారు.

కోహెడ మండల వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 38598 ఉన్నారని వారందరికి కూడా ఎనుమురేషన్ ఫామ్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. సర్ ప్రక్రియ ఈ నెల 24 వరకు చివరి రోజు కావడంతో గ్రామాలలో బీఎల్ఓ, బీఎల్ఏ లతో ఆయా గ్రామాల యువత, విద్యావంతులు భాగస్వాములై వంద శాతం నిర్ణీత సమయంలోగా పూర్తి చేయుటకు కృషి చేయాలని తహసీల్దార్ కోరారు. కార్యక్రమం లో  మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, వార్డు సభ్యులు గుగ్గిళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.