ఐఐఐటికీ ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సహాయం
15-07-2026 07:43 PM
బిబిపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నక్షత్ర బాసర ఐఐఐటి ఎంపికయింది. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వ్యాన్ కు విన్నవించగా రెడ్ క్రాస్ సొసైటీ నుండి 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం బుధవారం విద్యార్థిని నక్షత్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎన్ వై గిరి, రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీ ప్రతినిధులు ఎం.రాజన్న , అంకన్నగారి నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు.






