జీవో 49ని రద్దు చేయాలి
- టైగర్ కన్జర్వేషన్ రిజర్వుతో గిరిజనేతరులకు అన్యాయం
- మంత్రి సీతక్క స్పందించాలి
- దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రం చేస్తం: ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు
బెజ్జూర్, జూన్ 15(విజయక్రాంతి): టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో (జీవో నం.49)ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎటువంటి సంప్రదిం పులు లేకుండా ఏక పక్షంగా,ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభు త్వం జీవో నం.49 ను తీసుకువచ్చి కుమురం భీం జిల్లాలోని రైతులకు, గిరిజనులకు, గిరిజనేతరులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు.
ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని దాదాపు 4 లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి, ప్రజలు తిరగలేని పరిస్థితి దాపురిస్తుందని తెలిపారు.ఇప్పటికే పంచాయతీరాజ్ ఆర్ బి రోడ్లకు కనీసం మరమ్మతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కన్జర్వేషన్ రిజర్వు పేరిట అటవీ అనుమతులు వచ్చే పరిస్థితి ఉండదని విమర్శించారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేని పరిస్థితి వచ్చిందని, తాగునీటికి బోరింగ్లు వేయనీయకుండా అట వీ అధికారులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. టైగర్ కన్జర్వేషన్ రిజర్వు పేరిట అటవీ అధికారులు పెట్రేగి పోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం జరుగుతుందని అన్నారు. జీవో నంబర్ 49పై ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తుంటే కనీసం గిరిజన ఇంచార్జి మంత్రి అయిన సీతక్క స్పం దించక పోవడం అన్యాయమన్నారు.
ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పలేక ఇంచార్జ్ మంత్రి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ పారిపోయారని ఎదేవా చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకు లు స్పందించకపోవడం వారి డొల్లతనాన్ని తేట తెల్లం చేస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
రేపటి నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ముందు జీవో నం.49 ప్రతులను దహనం చేసి తహసీల్దార్ లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జీవో నంబర్ 49 (కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వు)కు వ్యతిరేకంగా జిల్లాలో గిరిజన సంఘాలు,అఖిల పక్షాలు జేఏసిగా ఏర్పడి జీవో నం. 49ను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటా లు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పిలుపునిచ్చారు.
దశలవారీగా ఉద్యమా న్ని తీవ్రతరం చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ఈ జీవోను విరమింప చేస్తామని తెలిపారు.అనంతరం జీవో నంబర్ 49 ప్రతులను భాజపా నాయకులతో కలిసి దహనం చేసి కాంగ్రెస్ డౌన్ డౌన్ , జీవో 49 ను రద్దు చేయాలని అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు ఆర్మీ శివ, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, మండల అధ్యక్షుడు పుల్ల అశోక్, మాజీ ఎంపిటిసి గణపతి, తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తిరుపతి గౌడ్, మహేష్ పాల్గొన్నారు.






