30 August, 2026 | 8:08 PM

Breaking News

గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •   ఎల్లమ్మ తల్లి చల్లని చూపు జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •   విద్యార్థులకు సైక్లింగ్ పోటీ   •  

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

15-06-2025 11:08 PM

12 మంది అరెస్ట్, కేసు నమోదు..

హుజూర్ నగర్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్టు చేసిన ఘటన గరిడేపల్లి మండలంలోని కట్టవారి గూడెం గ్రామంలో ఆదివారం జరిగింది. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్(SI Chalikanti Naresh) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న కట్టవారిగూడెం గ్రామానికి చెందిన పట్టేటి శ్రీకాంత్, రాయిరాల కొండలు, గోపీచంద్, పూసపాటి వినయ్, గందే భాస్కర్, కీత సురేష్, పఠాన్ సైదా, రాయిరాల గోపి, గండమళ్ళ వెంకన్న, మీసాల శివాజీ, దార రాజు, పఠాన్ మహబూబ్ అలీ, బాల్దురి వెంకటయ్యలను గుర్తించారు. వీరిలో ముగ్గురు పారిపోయినప్పటికీ మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిదగ్గర నుంచి 7 మోటార్ బైకులు, 7 సెల్ఫోన్లు రూ.4,250 నగదు స్వాధీనం చేసుకుని, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ నరేష్ తెలిపారు.