బీసీలను చైతన్యవంతం చేయడమే తమ లక్ష్యం
బీసీ నాయకులు నామని జగన్నాథం..
చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యం చేసి ముందుకు సాగడమే తమ లక్ష్యమని బీసీ నాయకులు నామని జగన్నాథం(BC leaders namani Jagannatham) అన్నారు. ఆదివారం గట్టుప్పల్ మండల(Gattuppal Mandal) కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాబుజి ఆలోచనలతో ప్రేరితమై కటకం నర్సింగరావు స్థాపించిన మన ఆలోచన సాధన సమితి జెండాను సందర్భంగా బీసీ నాయకుడు నామని జగన్నాధం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, వాటా, హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలి అని పిలుపునిచ్చారు. బీసీ సమాజం సామాజికంగా, రాజకీయంగా బలపడేలా ఈ వేదిక ఆధ్వర్యంలో కృషి కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది బీసీ నాయకులు హాజరయ్యారు. ముఖ్యంగా మాల గాని గోపాల్, చెరుపెల్లి సత్తయ్య, జెల మారయ్య, భీమ గాని మల్లేశం, కర్నాటి సుధాకర్, పెదగాని రాఘవేంద్ర, తిరందాస్ రాములు, దోర్నాల రాములు, చిలుకూరు అంజయ్య, నీళ్ల కుమార్, కౌడగాని శేఖర్, శీను తదితరులు పాల్గొన్నారు.






