28 June, 2026 | 3:31 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

సీపీఐ బెల్లంపల్లి నూతన బాడీ ఎన్నిక

16-06-2025 12:00 AM

బెల్లంపల్లి అర్బన్, జూన్ 15 : భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి మండల 12వ మహాసభను కామ్రేడ్ బాసెట్టి గంగారం భవన్ లో ఆదివారం నిర్వహించారు. మాజీ సర్పంచ్, సిపిఐ సీనియర్ నాయకులు మూల శంకర్ గౌడ్ జండా ఆవిష్కరణ చేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం అధ్యక్షతన వహించారు.

ఈ మహా సభలో మండల నూతన బాడీని ఎన్నుకున్నారు. నూతన మండల కార్యదర్శిగా బొంతల లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిలుగా మేకల తిరుపతి, గోమాస గంగారం, కోశాధికారిగా మీణుగు లక్ష్మీనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బెల్లంపల్లి మండల సమగ్ర అభివృద్ధికోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యత పాటించకపోవడంపై విచారణ చేసి దోశులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బికేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమా ణిక్యం, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు డిఆర్ శ్రీధర్, బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తిలక్ అంబేద్కర్, నాయకులు బియ్యాల ఉపేందర్, పొలసాని సహదేవరావు, జూపాక సరోజ, బుడిమే వెంకటేష్, కందుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.