24 April, 2026 | 6:32 PM

Breaking News

విశారదన్ మహారాజ్ ముందస్తు అరెస్ట్   •   పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్   •   బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •  

విద్యుత్ ఘాతంతో మేక మృతి

24-04-2026 04:58 PM

చందంపేట,(విజయక్రాంతి): చందంపేట మండలం బొల్లారంపట్టి గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మేక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గాలి దుమారం కారణంగా మెయిన్ లైన్ వైర్లు తెగి ఉండగా, మేతకు తీసుకెళ్లిన మేకలు వాటిని తాకడంతో ఒక మేక అక్కడికక్కడే కాలిపోయి మృతి చెందింది. మేకల కాపరి వడ్త్యా భరత్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన తన కంటి ముందే జరిగిందని, మేక విలువ సుమారు రూ.20,000 ఉంటుందని చెప్పారు. స్థానిక సర్పంచ్ నేనావత్ హనుమానాయక్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.ఈ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.