24 April, 2026 | 5:47 PM

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

24-04-2026 03:58 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని సమ్మెల గ్రామపంచాయతీ శివారులో శుక్రవారం అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. కల్టివేటర్ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడం ఒక వ్యక్తి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు ఘటన జరిగినట్లు సమాచారం అందించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని బోల్తా పడ్డ ట్రాక్టర్ కింద చిక్కుకున్న వ్యక్తి మృతదేహాన్ని  స్థానికుల సాయంతో బయటికి తీశారు. ప్రమాదం ఎలా చోటు చేసుకుందో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయని స్థానికులు తెలిపారు.