26 May, 2026 | 4:23 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

భక్తిశ్రద్ధలతో గోదావరి హారతి

06-04-2026 10:13 AM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం దివ్య క్షేత్రంలోని పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహిస్తున్న గోదావరి నది హారతి పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ తదియ మాసంలోకి ప్రవేశించి భక్తుల సంఖ్యను మరింత పెంచుతుందని నదీ హారతిని వీక్షించే భక్తులకు ఎంతో ప్రతిష్టాత్మకమైనదని పురోహితులు రామవజల రవికుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ విశేషమైన చైత్ర శుద్ధ తదియ ఆదివారం దివ్య క్షేత్రం భద్రాద్రిలో నిర్వహిస్తున్న గోదావరి హారతి కూడా చాలా విశిష్టమైనదని ఆయన అన్నారు.  

అనంతరం  పురోహితులు గోదావరి హారతి విశేషాలను మరియు చైత్ర శుద్ధ తదియ మాసానికి సంబంధించిన విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే సృష్టింప చేసి, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు. 

అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు డాక్టర్ గోళ్ళ భూపతి రావు దంపతులు ప్రసాదం పంపిణీ చేయడం జరిగినదని, నదిహారతి కార్యక్రమానికి పూజా సామాగ్రి రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ భద్రాచలం వారు అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సురేష్ శర్మ,అశోక్ కుమార్ శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, ఫణి కుమార్ శర్మ, కృష్ణ శర్మ, తేజ శర్మ, స్వచ్ఛంద సంస్థలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.