కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు
2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు
‘తెలంగాణ బ్రాండ్’ ప్రతిబింబించేలా ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు
సమన్వయానికి స్పెషల్ ఆఫీసర్, శాఖలవారీగా నోడల్ అధికారులు
క్యాబినేట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రులు
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోం దని క్యాబినేట్ సబ్ కమిటీ స్పష్టంచేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగేలా, మన సం స్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో క్యాబి నెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో సభ్యు లు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభు త్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క, సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిం దని గుర్తుచేశారు.
అదే స్ఫూర్తితో మరింత రెట్టించిన ఉత్సాహంతో గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారని చెప్పారు. సు మారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలివచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామని వివరించారు.
గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉం చుకుని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇత ర మౌలికసదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగం గా పనులను ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నామన్నారు.
ఈ నెలఖారుకు డీపీఆర్ పూర్తి
ఈ నెల చివరి నాటికి డీపీఆర్‌లను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ 1’ కింద ఎంపిక చేశామని చెప్పారు. సమన్వయలోపం తలెత్తకుండా పుష్కరాల నిర్వహ ణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖలవారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు.
ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. పుష్కర ఏర్పాట్లలో రాజీపడే ప్రసక్తే లేదని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నా రు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అ త్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.




