29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

మానేరు బ్రిడ్జిపై రైతుల ధర్నా

11-03-2026 12:00 AM

ఎల్‌ఎం -6, ఎల్‌ఎం -4 కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్

తంగళ్లపల్లి మండల రైతుల ధర్నా

మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు

అరెస్టు చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల, మార్చి 10 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్‌ఎం -6, ఎల్‌ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. సిరిసిల్ల తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బీజే పీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నా యకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు రైతులను, బీజేపీ నా యకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడారు. తంగళ్లపల్లి 11వ ప్యాకేజీ రంగనాయక సాగర్ ద్వారా కెనాల్ నిర్మాణ పనులకు రూ.3 కోట్లు నిధు లు కేటాయించి పనులు చేపట్టకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నా రు. తంగళ్లపల్లి మండలంలో సుమారు 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ.. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌కానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కెనాల్ నిర్మాణం ద్వారా పది వేల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు. నిధులు మంజూరైనా భూసేకరణ పనులు చేపట్టలేదని విరుచుకుపడ్డారు.