1 September, 2026 | 9:34 PM

శాకాంబరి దేవిగా వన దుర్గామాత

29-06-2025 | 07:03pm

పాపన్నపేట: ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల శ్రీ వన దుర్గామాత(Sri Edupayala Vana Durga Bhavani) ఆదివారం రోజున శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. ఆషాడ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం నుంచే వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాకాంబరిదేవి రూపంలో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాడ మాసంలో అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం వలన లోకమంతా సస్యశ్యామలంగా, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉంటుందని అర్చకులు వివరించారు.