9 May, 2026 | 1:34 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

శాకాంబరిదేవిగా వన దుర్గామాత

30-06-2025 03:19 AM

పాపన్నపేట, జూన్ 29 : ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల శ్రీ వన దుర్గామాత ఆదివారం రోజు న శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. ఆషాడ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం నుంచే వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి శాకాంబరిదేవి రూపంలో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాడ మాసంలో అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం వలన లోకమంతా సస్యశ్యామలంగా, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉంటుందని అర్చకులు వివరించారు.