9 May, 2026 | 2:34 PM

Breaking News

బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •   పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం   •   ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •  

సిద్దిపేట మున్సిపాలిటీలో సమైక్యత వజ్రోత్సవాల్లో రూ.7.5 లక్షల అవినీతి

30-06-2025 03:22 AM

సిద్దిపేట, జూన్ 29 (విజయక్రాంతి): సిద్దిపేట మున్సిపాలిటీలో అవినీతి రాజ్యామేలుతుందని 38 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరo బ్రహ్మం ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ 2022లో జరిగిన తెలంగాణ సమైక్యత వజ్రత్సవాళ్ళో దాదాపు రూ.7.5 లక్షల అవినీతి జరిగిందన్నారు. సిద్దిపేట మున్సిపల్ అధికారులు వజ్రత్సవాలకు సంబంధించిన ఖర్చు రూ.30లక్షలు చూపేట్టారని వాటికి సంబందించిన బిల్లులు కలెక్టర్ కార్యాలయానికి అందించగా రూ.7.50 లక్షలు, రూ.15 లక్షలు రెండు చెక్కుల రూపంలో అందించారన్నారు.

మిగతా రూ.7.5 లక్షలు క్యాష్ రూపంలో అందించారని అధికారులు స్వయంగా ఆర్ టి ఐ దరఖాస్తూ ద్వారా తెలిపారని అన్నారు. మున్సిపల్ ఎజెండాలో కే వలం రెండు చెక్కులు రూ. 22.50లక్షలు మాత్రమే చూపించారని, మరి క్యాష్ రూపంలో వచ్చిన రూ.7.50 లక్షలు ఎందుకు చూపెట్టలేదని ప్రశ్నించారు. ఆ నగదు రూపంలో ఉన్న డబ్బులు ఎటు వెళ్ళాయన్నారు. ఇలాంటి అవినీతి సిద్దిపేట మున్సిపాలిటీలో ఇది మచ్చుకు మాత్రమేనని, మరెన్నో ఉన్నాయన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులపై సిబిఐ, విజిలెన్స్ తో సమగ్ర విచారణ జరిపించాలనీ డిమాండ్ చేశారు.