2 September, 2026 | 11:05 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

బంగారం@ 99,900

22-04-2025 | 01:43am

కిలో వెండికి 99,299

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: బంగారం ధర సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో కొండెక్కి కూర్చున్న పుత్తడి సోమవారం మ రింత ప్రియంగా మారింది. ఒకానొక దశలో  సోమవారం 24 క్యారె ట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,00,016 (3 శాతం జీఎస్టీతో కలి పి) పలికింది. ఆపై కాస్త దిగొచ్చి రూ. 99,900 వద్ద స్థిరపడింది. శుక్రవా రం ముగింపుతో పోలిస్తే సోమవా రం బంగారం ధర రూ. 2వేలు పెరిగింది.

డాలర్ బలహీనపడటం, అ మెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధర రాకెట్ స్పీడ్‌లో పెరిగేందుకు కారణం అవుతున్నా యి. ఈ ఏడాదిలో 10 గ్రాముల బంగారానికి 26 శాతం మేర దాదా పు రూ. 20,800 ధర పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి ధర 3,405 డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ఓసారి లక్ష మార్కు ను క్రాస్ చేసిన కిలో వెండి ధర రూ. ఇప్పుడు 99,299 పలుకుతోంది.