తగ్గిన బంగారం, వెండి ధరలు
వడ్డీ రేట్లపై కొనసాగుతున్న అనిశ్చితి
న్యూఢిల్లీ, మార్చి 16: గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలలో పసిడి రేట్లు గణనీయంగా దిగివచ్చాయి. ఇజ్రాయిల్ అమెరికా, ఇరాన్ యుద్ధం నేపధ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి, సిల్వర్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికప్పుడు అమెరికా ఫెడ్ సహా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు కొనసాగుతున్న అనిశ్చతతో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు డాలర్ విలువ బలోపేతం కాండం కూడా బంగారం, వెండి గిరాకీ తగ్గడానికి కారణం.
ఈ నెల౯ నుంచి 15వ తేదీ మధ్య లో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.2,000 వరకు తగ్గగా, వెండి ధరలో కూడా భారీ పతనం నమోదైంది. నగరాల వారీగా ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్ మార్కెట్లో మార్చి 9న రూ.1,61,680గా ఉ న్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, 15వ తేదీ నాటికి రూ.1,59,660కి చేరింది. అంటే, వారం రోజుల్లో రూ.2,020 తగ్గింది. అదేవిధంగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,200 నుంచి రూ.1,46,350కి పడిపోయింది.
ఇదే తరహాలో ఢిల్లీలో 24 క్యా రెట్ల బంగారంపై రూ.2,020, చెన్నైలో సుమారు రూ.2,070 మేర తగ్గుదల కనిపించింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. వారం ప్రారంభంలో కొన్ని మార్కెట్లలో రూ.2.90 లక్షలుగా ఉన్న కేజీ వెండి ధర, వారాంతానికి రూ.2.80 లక్షలకు తగ్గింది. దీంతో కేజీపై సుమారు రూ.10 వేల ధర తగ్గింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలతో పసిడి ధరలు తగ్గినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




