19-11-2025 12:00:59 AM
అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చిన మార్పులేనంటున్న బుల్ వ్యాపారులు
హైదరాబాద్, నవంబర్ 18: పసిడి, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు తగ్గాయి.దేశీయ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు దిగిరావడంతో దేశీయంగానూ పసిడి ధరలు బాగా తగ్గాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.25 లక్షలు ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.1.14 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కిలో రూ.1.56 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగణుంగా పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ నెల 13న పుత్తడి ధర రూ.1.30 లక్షలు ఉంది.