1 March, 2026 | 3:13 AM

హైదరాబాద్ తిరోగమనం

01-03-2026 01:03 AM
  1. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలన అన్ని రంగాల్లో నగరాన్ని దెబ్బకొట్టింది
  2. సీఎం అవినీతి, అక్రమాలు, స్కామ్‌లతోనే ఈ పరిస్థితి
  3. మేం రాజధానిని అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దాం
  4. తన రియల్ ఎస్టేట్ కోసమే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ప్రమోషన్
  5. ప్రభుత్వ పక్షపాత వైఖరిని అన్నివిధాలా ఎండగడతాం
  6. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాం తి): రెండు సంవత్సరాల కాలంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుపోయారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం మాత్రమే రేవంత్‌రెడ్డి పరిపా లన చేస్తున్నారని, అందుకే హైదరాబాద్ నగరంలో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని పతనం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రాజధాని నుంచి దోచుకోవడానికి ‘హైడ్రా’ నుంచి మొదలుకొని పారిశ్రామిక భూముల స్కామ్, టీడీఆర్ పేరిట మరొక స్కామ్, ఇలా ఫోర్త్ సిటీ భూముల కుంభకోణం నడుస్తోందని ఆరోపించారు.  రేవంత్‌రెడ్డి 24 నెలలుగా చేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని అన్నారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం నెలకొని ఉన్నదన్నారు.

నగరంలో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడూ లేనటువంటి కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు అన్నీ తిరిగి రాష్ట్ర రాజధానిలో దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో బీఆర్ ఎస్, జీహెచ్‌ఎంసీ నగర పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యా చరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలు వంటి వాటిని విస్తృతంగా చర్చించారు. పార్టీ పరంగా అటు ప్రభుత్వం పైన చేయాల్సిన పోరాటానికి సంబంధించిన అంశంలో కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో, అక్రమ సంపాదన లక్ష్యంగా తన భూములకు విలు వ తీసుకురావడం కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రం నుంచి మొదలుకొని ఇతర దేశాలకు ఎక్కడ వెళ్లినా కూడా హైదరాబాద్ గురించి మాట్లాడకుం డా, కేవలం తన స్వప్రయోజనాల కోసం ఫ్యూచర్ సిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.

ఉన్న హైదరా బాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన చేయకుండా, కనీస పౌరసేవలు అందించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో తిరోగమనంలోకి తీసుకువెళుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 10 సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీ ఆర్ మార్గదర్శకత్వంలో, నాయకత్వంలో హై దరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి లో అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దామన్నారు.

కరెంట్ కోతలు లేకుండా, తాగు నీరు, పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని ప్రజా రవాణా వరకు అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయామని కేటీ ఆర్ గుర్తు చేశారు. అందుకే ప్రజలు రెండు సార్లు రాష్ట్ర రాజధానిలో మేయర్ పీఠాన్ని మా పార్టీకి కట్టబెట్టారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరంలో సొంతంగా మేయర్ పీఠం పైన గులాబీ జెండాను ఎగురవేశామని కేటీఆర్ గుర్తు చేశారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలతో, అవినీతితో పట్టణాన్ని పూర్తి గా పండబెట్టిందని, తెలంగాణ ఆర్థిక ఇంజన్‌ను కూలగొట్టి, నగరంలో రియల్ ఎస్టేట్ ను, నగర ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలు అన్నింటినీ కుప్పకూల్చిందన్నారు. ఈ సందర్భంగా నగరంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల కోసం పార్టీ కార్యక్రమాలను, నాయకులకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం చేసుకోవ డానికి జీహెచ్‌ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, మాజీ ఎశ్రీ కర్నె ప్రభాకర్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు.