calender_icon.png 19 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాదిలో 50 వేల ఎంజీ విండ్సర్ కార్ల విక్రయం

19-11-2025 07:47:16 PM

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అరుదైన మైలురాయి అందుకుంది. ఏడాదిలోపే 50 వేల ఎంజీ విండర్స్ కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. తద్వారా రికార్డు సమయంలో 50,000 అమ్మకాల మార్కును దాటిన మొదటి ఈవీ కంపెనీగా అవతరించింది. ఈవీ సెక్టార్లలో విండర్స్ కార్లకు ఆరంభం నుంచీ మంచి డిమాండ్ ఏర్పడిందని జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు. ప్రతీ నెలకూ డిమాండ్ పెరగడం ప్రస్తుత మైలురాయికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఎంజీ విండ్సర్ యొక్క వినూత్న డిజైన్, అత్యుత్తమ పనితీరు కస్టమర్లను అద్భుతంగా ఆకట్టుకుందని తెలిపారు.

విండ్సర్ ఈవీని ప్రారంభించినప్పుడు తాము చిన్న లక్ష్యాలనే పెట్టుకున్నప్పటకీ దాని పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా మంచి డిమాండ్ వచ్చిందని వెల్లడించారు.భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం తమ లక్ష్యాల్లో ఒకటిగా ఉందన్నారు. 400 రోజుల లోపే 50 వేల ఈవీ కార్ల విక్రయం గొప్ప మైలురాయిగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే ఎంజీ విండ్సర్ ఇన్‌స్పైర్ అనే పరిమిత ఎడిషన్ సిరీస్‌ను ప్రారంభించింది, దీనిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ కొత్త కారు ధరను  9.99లక్షలుగా నిర్ణయించారు.  ఎంజీ విండ్సర్, సాంప్రదాయ సెగ్మెంటేషన్ భావనను అధిగమించే ఫ్యూచరిస్టిక్ 'ఏరోగ్లైడ్' డిజైన్ లాంగ్వేజ్‌తో రూపొందించారు. లోపల, కారు బిజినెస్-క్లాస్ సౌకర్యంతో తీర్చిదిద్దారు. ఈ కొత్త కారు విక్రయాల్లోనూ తమ లక్ష్యాలను మించి అందుకుంటామని అనురాగ్ మెహ్రోత్రా చెబుతున్నారు.