02-02-2026 10:28:54 PM
మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మాంట్రా ఎలక్ట్రిక్ భారత ప్రభుత్వ 'పిఎం ఈ-డ్రైవ్ పథకంకింద సర్టిఫికేషన్ పొందిన దేశంలోని మొట్టమొదటి హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ తయారీదారుగా నిలిచింది. తద్వారా భారతదేశ క్లీన్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయానికి గుర్తుగా, కంపెనీ దేశంలోని మొట్టమొదటి పిఎం ఈ-డ్రైవ్ సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ హెవీ ట్రక్ అయిన 'రైనో 5538 ఈవీ 6x4 ట్రాక్టర్ ట్రైలర్'ను, భారతదేశపు అతిపెద్ద సిమెంట్ మరియు రెడీ-మిక్స్ కాంక్రీట్ కంపెనీ అయిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్‌కు డెలివరీ చేసింది. మొదటి పిఎం ఈ-డ్రైవ్ సర్టిఫైడ్ 'రైనో 5538 ఈవీ'ని అరుణ్ మురుగప్పన్ జెండా ఊపి ప్రారంభించి, అల్ట్రాటెక్‌కు అందజేశారు. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని ముందుకు తీసుకెళ్ళడంలో తన నిబద్ధతను బలోపేతం చేసుకుంది.
మాంట్రా ఎలక్ట్రిక్ (టిఐ క్లీన్ మొబిలిటీ) చైర్మన్ అరుణ్ మురుగప్పన్, ఎండి జలజ్ గుప్తా, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ సత్య రాజ్ సమక్షంలో ఈ మైలురాయిని అందుకున్నారు.. భారతదేశ క్లీన్ మొబిలిటీ ఎకోసిస్టమ్‌కు ఈ విజయం ఎంత ప్రాముఖ్యమైనదనీ వివరించారు. ఈ చర్య భారతదేశ లాజిస్టిక్స్, మైనింగ్, నిర్మాణ మరియు ఇతర భారీ పరిశ్రమల రంగాలలో ఎలక్ట్రిక్ హెవీ-డ్యూటీ ట్రక్కుల స్వీకరణను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. భారతదేశ డీకార్బనైజేషన్ (కర్బన ఉద్గారాల తగ్గింపు) లక్ష్యాలకు అనుగుణంగా, స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాల వైపు ఇది ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుంది.
రూ. 10,900 కోట్ల పిఎం ఈ-డ్రైవ్ పథకంలో ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం ప్రత్యేకంగా రూ. 500 కోట్లు కేటాయించారు. దీనివల్ల రైనో 5538 ఈవీకి సంబంధించి ఒక్కో వాహనానికి రూ. 9.6 లక్షల వరకు వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రోత్సాహకం నిర్వహణ ఖర్చులను తగ్గించడం, ఇంధన ధరల అస్థిరత నుండి రక్షణ కల్పించడం మరియు మారుతున్న సుస్థిరత, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి సహాయపడటం ద్వారా... దీర్ఘకాలికంగా ఫ్లీట్ ఆర్థిక లాభాలను మెరుగుపరుస్తుంది.