27 July, 2026 | 5:07 PM

కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి

27-07-2026 04:36 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు (రెవెన్యూ) కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు, డీఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.