calender_icon.png 9 February, 2026 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

09-02-2026 01:41:31 PM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,56,870, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,43,820గా ఉంది. సోమవారం ప్రధాన మెట్రో నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,56,700గా ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,57,410గా నమోదైంది. ఢిల్లీలో బంగారం ధర రూ.1,56,870, కోల్‌కతాలో రూ.1,56,710, ముంబైలో రూ.1,56,730 మరియు పుణెలో రూ.1,56,750, హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,600, 22  క్యారెట్ల 10 గ్రాములకు రూ.1,45,600  ఉంది.

ఈ అన్ని నగరాల్లోనూ 10 గ్రాములకు రూ.10 మేర ధర తగ్గింది. అలాగే ఇవాళ వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.3,01,900కి చేరింది. బెంగళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.2,959, చెన్నైలో రూ.2,989, ఢిల్లీలో రూ.3,019, కోల్‌కతాలో రూ.2,969, ముంబైలో రూ.3,009, పుణెలో రూ.3,029, హైదరాబాద్ లో కిలో ధర రూ.2,82,000 ఉంది.