24 April, 2026 | 9:01 AM

బంగారం మరింత ప్రియం

25-02-2025 02:19 AM

న్యూఢిల్లీ: పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ నేపథ్యంలో సోమవారం దేశంలో బంగా రం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.350 పెరిగి పది గ్రాములకు రూ.89,100కు చేరుకుంది.99.5 ప్యూరిటీ గోల్డ్ సైతం అదే స్థాయిలో పెరిగి 10 గ్రాములకు రూ.88,700కు చేరుకుంది.

ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,550 ఉండగా, 24 క్యారెట్ల బంగా రం ధర రూ.87,750గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర పదిగ్రాములు రూ.80,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87, 870కి పెరిగింది.  హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 1.08 లక్షలు పలుకుతోంది.