2 July, 2026 | 12:02 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

బంగారు ఆభరణాల దొంగ అరెస్ట్

27-03-2025 12:00 AM

కల్లూరు, మార్చి 26: గత కొద్ది రోజుల క్రితం మండల పరిధిలోని కొర్లగూడెం, కప్పల బంధం రోడ్డు నందు గుర్తు తెలియని వ్యక్తులు గొలుసులు దొంగిలించారు. నిందితులను బుధవారం కల్లూరు పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ రఘు వివరాలను తెలిపారు. నిందితుల్లో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నామవరం గ్రామానికి చెందిన మూడ్ రమేష్, మూడ్ గణేష్, వెంకటాద్రిగూడెంకి చెందిన కిరణ్ ఉన్నారు.

ముగ్గురు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారు. ఈ నెల 17న కొర్లగూడెం  గ్రామంలో ఒక మహిళ మెడలోని 20 గ్రాముల బరువైన 65 వేల రూపాయలు బంగారు నానత్రాడుని లాక్కొని పారిపోయినారు. నమ్మదగిన సమాచారం మేరకు కప్పలబందం రోడ్డు వద్ద బుధవారం పోలీసులు రమేష్‌ను అరెస్టు చేశారు. గణేష్ కోసం గాలిస్తున్నారు.