2 July, 2026 | 10:53 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి..

26-03-2025 11:47 PM

పటాన్ చెరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ.. 

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్..

సంగారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. బుధవారం పటాన్ చెరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను, స్టేషన్ రికార్డ్లను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రికార్డ్ అప్ టు డేట్ ఉండాలని అన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ భాద్యతాయుతంగా విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 

పటాన్ చెరు హైదరాబాద్ లో భాగమని, అధిక ట్రాఫిక్ రద్దీ అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం, సంబంధిత అధికారులతో మాట్లాడి బోలార్డ్స్ వేయించడం, విజిబుల్ పోలిసింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, పటాన్ చెరు డియస్పి రవీందర్ రెడ్డి, పటాన్ చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.