07-10-2025 06:22:04 PM
హైదరాబాద్: బంగారం ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. స్థానిక బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రెండూ కొత్త లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ నివేదికల ప్రకారం... హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సోమవారం రూ.1,23,460 నుండి రూ.390 పెరిగి రూ.1,23,850కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,500గా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. వెండి గ్రాముకు రూ.150 పెరిగి ఇవాళ కిలో రూ.1,54,350కి చేరుకుంది. ఇది అంతకుముందు రోజు రూ.1,54,200 ఉంది.
విలువైన లోహాల ధరల స్థిరమైన పెరుగుదలకు, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్, ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చనే అంచనాలతో సహా కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ముడిపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇది పెట్టుబడిదారులు తమ నిధులను బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లించడానికి ప్రేరేపించింది.