30 August, 2026 | 9:07 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

విజయవాడ కనకదుర్గకు బంగారు బోనం సమర్పణ

29-06-2025 01:15 PM

విజయవాడ కనకదుర్గకు హైదరాబాద్ మహాకాళి బోనం సమర్పణ

హైదరాబాద్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాదిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ బంగారు బోనానికి ఈవో, హైదరాబాద్ ఉత్సవ కమిటీ పూజ చేసి మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బ్రాహ్మణవీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ తెలంగాణకు చెందిన 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణతో కోలాహలంగా పోతురాజులు, డప్పు, కోలాటాలతో సందడిగా ఊరేగింపు సాగింది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా బంగారు బోనం సమర్పణ ఆనవాయితీ అయింది.