calender_icon.png 29 June, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూస్ ప్రెజెంటర్ ఆత్మహత్య కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

29-06-2025 12:44:13 PM

హైదరాబాద్: టీవీ న్యూస్ ప్రెజెంటర్ శ్వేత వోటార్కర్ ఆత్మహత్య(TV News Presenter Swetcha Votarkar Commits Suicide)కు కారణమైన పూర్ణ చంద్రనాయక్(Purna Chandra Nayak) చిక్కడపల్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. న్యాయవాదులు పూర్ణ చంద్రతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్ణ చంద్రనాయక్ తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన పరిస్థితులను సృష్టించారని స్వేచ్చ తల్లిదండ్రులు ఆరోపించారు.

స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న పూర్ణ చంద్రనాయక్ ఆమె మృతికి, ఆమె మానసిక పరిస్థితి, ఆమె తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమన్నట్లుగా లేఖ విడుదల చేశాడు. హైడ్రామా మధ్య శనివారం రాత్రి 11 గంటల సమయంలో పూర్ణ న్యాయవాదితో కలిసి వచ్చి చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయ్యారు. నేడు ఆదివారం కాబట్టి పూర్ణను విచారించి, రేపు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వార్తా వ్యాఖ్యాత శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.