11 March, 2026 | 12:12 AM

గోల్డెన్ నంది అవార్డు గ్రహీత యోగా గురువు చాడ పాపిరెడ్డికి సన్మానం

09-03-2026 12:18 AM

సూర్యాపేట, మార్చి 8 (విజయక్రాంతి): ఈనెల 1న మెఘ హెల్పింగ్ ఫౌండేషన్, మేఘ ఈవెంట్స్  హైదరాబాద్ వారు ఉగాది సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రధానం చేయడంలో భాగంగా  సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు, యోగా గురువు చాడ పాపిరెడ్డికి గోల్డెన్ నంది అవార్డు ప్రకటించి సత్కరించారు. దీంతో ఆదివారం సూర్యాపేటలో యోగా గురువు  చాడ పాపిరెడ్డిని ఘనంగా సన్మానించారు.

అనంతరం యోగా గురువు చాడ పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు నాకు రావడం ఎంతో బాధ్యత ను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో సంత్ నిరంకార్ సంస్థ జిల్లా నిర్వాహకురాలు కడారి సరళ , రిటైర్డ్ ఆర్ ఐ శ్రీపాద భాస్కర చారి, బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి కట్టెకోల పూర్ణచంద్రరావు, గోరెంట్ల శ్రీనివాస్, సుధాకర్, సుదర్శన్ రెడ్డి, శ్రీదేవి, రవీంద్ర చారి,వీరశేఖర్, బాలకృష్ణ, బాణాల శ్రీనివాస్, మమత, మంజుల, పద్మ తదితరులు పాల్గొన్నారు.