10 March, 2026 | 7:25 PM

టీజీవో ఆధ్వర్యంలో ఉమెన్స్ డే

09-03-2026 12:18 AM

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఖమ్మం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు టీజీవో భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏలూరు శ్రీనివాసరావు టీ జీవో రాష్ట్ర అధ్యక్షులు, టీజీఈజెఎసి సెక్రటరీ జనరల్, స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మం జుల హాజరయ్యారు. పి సుధారాణి టీజీవో మహిళా కార్యదర్శి అధ్యక్షత వహించి మా ట్లాడుతూ.. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన హక్కులు, న్యాయం, కార్యాచరణ, అందరు మహిళలు మరియు బాలికల కో సం అనే థీమ్తో పాటు, అంతర్జాతీయంగా గివ్ టు గేన్ అనే ప్రచారంతో మహిళా సాధికారతకు కొత్త అర్థాన్ని ఇవ్వాలన్నారు. 

ఏలూ రు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వేడుకలు జరుపుకోవడమే కాకుండా, మహిళలకు సమాన వేతనం, విద్య, రక్షణ కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం కేవలం ఒక రోజు కార్యక్రమం కాకుండా, ప్రతి మహి ళా తన హక్కుల కోసం, న్యాయం కోసం నిరంతరం పోరాడే స్ఫూర్తినిచ్చే రోజు మహి ళా దినోత్సవం అభిప్రాయపడ్డారు. జిల్లా సంక్షేమ అధికారిని వేల్పుల విజేత మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో ముం దుండాలని చెప్పారు.

కార్యక్రమం అనంతరం మహిళా అధికారులపే ఘనంగా స న్మానించారు. శ్రీ సత్య సాయి మహిళ వృ ద్ధాశ్రయంలో పండ్ల పంపిణీ నిర్వహించి అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్, కోశాధికారి సూరంపల్లి రాంబాబు, టీజీవో మహిళ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్ విజయ కుమారి, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ నవీన జ్యోతి, మహిళా అధికారులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.