వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
09-03-2026 12:17 AM
దేవరకొండ (చింతపల్లి), మార్చి 8 : చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల, వెంకటేశ్వర నగర్ (మాల్) గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు దేవరకొండ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, స్వామి దయా కరుణా కటాక్షాలతో దేవరకొండ శాంతి, సుభిక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




