గొల్ల కురుమలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలి
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆర్టిఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు
ముషీరాబాద్, ఆగస్టు1(విజయక్రాంతి): గొల్ల కురుమలు ఐక్యంగా ఉండి తమ హ క్కుల సాధన కోసం కృషి చేయాలని ఉమ్మ డి తెలుగు రాష్ట్రాలఆర్టిఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ మేర కు శనివారం జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు ఆధ్వర్యంలో రూపొందించిన ‘యాదవ కంఠం‘ మాసపత్రిక ఆవిష్కరణ, నూతనంగా నియమతులైన సంఘం చైర్మన్, డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యంగా గొల్ల కురుమలు ఐక్యంగా ఉండాలని కోరారు సంఘాలను విడదీసే ఆలోచనలు మారుకోవాలని విజ్ఞప్తి చేశారు కురుమ యాదవులను ఒకే తాటిపై తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద వ కులానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని అందులో భాగంగానే గొర్రెల మేకల అభివృ ద్ధి కార్పొరేషన్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు ఇతర శాఖలో అవకాశం కల్పించాలని చెప్పా రు.
సదర్ యాదవుల కధర్ అని చెప్పిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దేనని అన్నారు. గొర్రెల కాపరుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా యాదవ హాస్టల్ను కోకాపేటలో నిర్మాణం చేపట్టేలా చర్యలు ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మాజీ ఎమ్మెల్యే జై పాల్ యాదవ్ మాట్లాడుతూ యాదవ కులస్తులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్క రించుకోవాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యు డు బడుగుల లింగయ్య మాట్లాడుతూ తా ను ఎంపీగా ఉన్నప్పుడు గొల్ల కురుమల అభివృద్ధికి నిధులు కేటాయించాలని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగయ్య యాదవ్,భాస్కర్, నక్క శ్రీనివాస్, వేణుగోపాల్, దేవేందర్, శ్రీనివాస్ యాదవ్, పుల్లా రావు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.






